Saturday 31 July 2010

ఫ్రెండ్షిప్ డే - ఒక జ్ఞాపకం

స్నేహం... ఒక అందమైన భావన
స్నేహం... మనిషికి .....

ఇంకా ఏదో రాద్దాం అనుకున్నాను. స్నేహం గురించి ఇప్పటికే చాలామంది చాలా అందమైన వర్ణనలు చేసేసారు, నువ్వు రాసే చెత్త అనవసరం అని అరిచాడు నా ఆత్మా రాముడు. నేను కూడా తగ్గకుండా "నేను సైతం..." అని ఏదో చెప్పబోతుంటే "ఏడ్చావులే, భువన ఘోషలో నీ వెర్రి గొంతుక కూడా కలిసిందని మురిసిపోకు. నీ గొంతు దేనికి కలిపినా అక్కడ శృతి పాడవ్వడం తప్ప ఏమి జరగదు " అని తేల్చేసాడు. ఐ హర్ట్ అని చెప్పి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. (వీడి కవిత చదివే గోల తప్పిందని మీరు కూడా రిలాక్స్ అవ్వచ్చు). కాని నేను అసలు చెప్పాలనుకున్న విషయం వేరు. ఈ విషయంలో మాత్రం ఒక సారి కమిట్ అయిపోయాక నేను ఆత్మారాముడి మాటలు వినను.


ఫ్రెండ్షిప్ డే అనే పదం వినగానే నాకు వెంటనే గుర్తు వచ్చేది 2006 ఆగస్ట్ 6 (ఆ సంవత్సరం ఫ్రెండ్షిప్ డే). నా జీవితంలో మర్చిపోలేనిది.బహుశా ఇంకో నలుగురి జీవితాల్లో కూడా అది వాళ్ళకి చాలా ఇష్టమైన రోజు.

Saturday 17 July 2010

మాకూ వచ్చు తెలుగు

కృష్ణ అని నా స్నేహితుడు ఒకడు మా కంపెనీ లోనే పని చేస్తున్నాడు. నేను పూణే లో వాడు హైదరాబాద్ లో ఉండే వాళ్ళం  . రోజూ office communicator లో సొల్లు కబుర్లు చెప్పుకోవడం మాకు అలవాటు. "Hi dude! Weekend plans ఏంటి?" టైపులో మాట్లాడుకుని బోర్ కొట్టి ఒక రోజు నాకు కొత్త ఆలోచన వచ్చింది. మా వాడికి మాములుగానే చమత్కారాలు ఎక్కువ. నా ఆలోచన విని వాడు ఇంకా రెచ్చిపోయాడు. ఆ రెండు రోజుల మా సంభాషణలని ఇద్దరం సేవ్ చేసి పెట్టుకున్నాం . దాదాపుగా అది ఇలా ఉంటుంది.


(చదివే ముందు తెలియాల్సిన విషయాలు - మా వాడు అందరిని dude అనే పిలుస్తాడు. మేము కూడా వాడిని అలాగే పిలుస్తాం. అప్పట్లో మేము shifts లో పని చేసే వాళ్ళం. shift timings మధాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి పదింటి వరకు. )



నేను: రేయ్
కృష్ణ: చెప్పు
నేను: ఇవాళ నుంచి మనకి ఒక పోటి
కృష్ణ: ఏంటి?
నేను: ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలి
కృష్ణ: బాగుంది రా.
నాకు నచ్చినది. నేను మెచ్చితిని
నేను: ఈ క్షణమే ఆరంభం. చూపించుకో నీ తెలుగు జ్ఞానం
కృష్ణ: తప్పకుండా అందమైన తెలివైన యువకుడా
నేను: ??
కృష్ణ: అందమైన తెలివైన యువకుడు =dude