Sunday, 15 August 2010

సిరివెన్నెల విరిజల్లులు -4 : You & I


జల్సా సినిమాలోని ఈ పాట ఆ సినిమా విడుదలైన కొత్తలో మా రూమ్మేట్ laptop లో ఒక సారి ప్లే చేస్తే యధాలాపంగా విన్నాను. "అదే మనం తెలుగులో అంటే... dont worry be happy" - ఈ వాక్యం వినగానే నాకు ఈ పాట అంటే చిరాకొచ్చింది. తెలుగులో వచ్చిన అసంఖ్యాకమైన అర్ధం పర్ధం లేని పాటల్లో ఇది కూడా ఒకటిలే అనిపించి లైట్ తీస్కున్నాను (పాట రాసిందెవరో అప్పుడు నాకు తెలియదు).దృష్టి పెట్టి వినకపోవడం వలనో అప్పుడు ఆ పాట ప్లే చేసిన చెత్త స్పీకర్స్ వలనో కాని సంగీతం కూడా అంత వినసొంపుగా అనిపించలేదు. సినిమా చూసేటప్పుడు పెద్దగా ఉత్సాహం లేకుండా పవన్ కళ్యాన్ చేసిన స్టెప్స్ చూసి నా ఆవలింతలకి నోటికి ముందు చిటికెలు వేసుకుంటూ కూర్చున్నాను.


కాని మొన్నీ మధ్య ఒకరోజు లోకల్ ట్రైన్లో కూర్చుని నా walkman లో పాటలు వింటుంటే మధ్యలో ఈ పాట వచ్చింది. సరేలే టైం పాస్ కోసం విందాం అని వింటే అప్పుడు అనిపించింది ఇది అంత తీసి పారేయ్యల్సిన పాట కాదని. ఇంకో రెండు సార్లు వినగానే చాలా నచ్చింది. ఒక వారం పాటు మళ్ళీ మళ్ళీ వింటూనే ఉన్నాను. ముఖ్యంగా సాహిత్యంలో కొన్ని వాక్యాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి.

ఉదయాన్నే నిద్ర లేచిన ఒక కవికి, అందమైన ఉషోదయాన్ని , చుట్టూ వెలుగును నింపుతూ నెమ్మదిగా పైకి వస్తున్న ఎర్రని సూర్యుడిని చూస్తున్నప్పుడు ఒక రకమైన ఆలోచనలు కలిగితే, అదే సూర్యుడిని చూస్తున్న శాస్త్రవేత్తకి , ఉగ్రవాదికి పూర్తి భిన్నమైన ఆలోచనలు కలుగచ్చు. ప్రపంచం మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. అలాగే మనం ప్రతి రోజు చూసే విషయాలని, జరిగే చిన్న చిన్న సంఘటనలని అనుభవించడం ఆస్వాదించడం పూర్తిగా మన మనసుని బట్టే ఉంటుంది. మన జీవితం ఎంత అందంగా ఉంది అన్నది మన పరిస్థితుల కంటే కూడా, వాటిని మనం చూసే పద్ధతిని బట్టే ఉంటుంది. కాబట్టి జీవించే పద్ధతిని బట్టే జీవితం ఉంటుంది. ఇదంతా కింద ఇచ్చిన సాహిత్యంలో bold లో పెట్టిన వాక్యాలకు నా interpretation. ఇంత గొప్ప భావాన్ని ఇటువంటి పదాల్లో చెప్పడం ఆయనకే చెల్లు.



యే జిందగీ నడవాలంటే హస్ దే హస్ దే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా ఆగిందా ఆటం బాంబేస్తే
చల్ చక్దే చక్దే అంటే పడినా లేచొస్తామంతే

హకూనా మటాటా* అనుకో తమాషగా తల ఊపి
వెరైటిగా శబ్దం విందాం అర్ధం కొద్దిగా సైడుకి జరిపి
అదే మనం తెలుగులో అంటే dont worry be happy
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

You and I let's go high and do balle balle..
Life is like a saturday night lets do balle balle..

||చ -1||
ఎన్నో రంగుల జీవితం
నిన్నే పిలిచిన స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా

ఉంటే నీలో నమ్మకం
కన్నీరైనా అమృతం
కష్టం కూడా అద్భుతం కాదా

బొటానికల్ భాషలో పెటల్సు పూరేకులు
మెటీరియల్ సైన్సులో కలలు మెదడు పెను కేకలు
మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరిభాషలో మధురమైన కథలు

||You and I ||

||చ -2 ||
పొందాలంటే విక్టరీ
పోరాటం కంపల్సరీ
రిస్కంటే ఎల్లా మరి బోలో

ఎక్కాలంటే హిమగిరి
ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే హిస్టరీ లిఖ్లో

ఉటోపియా ఊహలో అటో ఇటో సాగుదాం
యుఫోరియా ఊపులో ఎగసి ఎగసి చలరేగుదాం
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం
ఎనాటమీ ల్యాబులో మనకు మనము దొరకం
||You and I ||


* "హకూనా మటాటా" అనే పదానికి అర్ధం సింపుల్ గా చెప్పాలంటే "All izz well" :) . మరిన్ని వివారాలు కావాలంటే ఇక్కడ క్లిక్కండి. ఈ పదాన్ని పాటలో వాడాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దేమో అని నా అనుమానం. ఎందుకంటే ఇతని ముందు సినిమాల్లో కూడా కొన్ని ఇటువంటి పర భాషా పద ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి.

ఇక పొతే ఈ పాటలో "మెటీరియల్ సైన్సు" అనే పదం ఈ సందర్భంలో వాడాల్సింది కాదు. నాకు తెలిసినంత వరకు మెటీరియల్ సైన్సుకు కలలకు సంబంధం లేదు :). కాని కవి భావం అర్ధం కావడానికి మాత్రం ఈ విషయం అడ్డం రాదు.

ఇక ఇందులోని "అదే మనం తెలుగులో అంటే dont worry be happy " అనే వాక్యానికి అర్ధం నాకు ఇప్పటికీ తెలియలేదు. దాని ముందు, తరువాత ఉన్న వాక్యాలను కలిపి ఆలోచించినా నాకు ఏమీ బోధపడడంలేదు. ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. మీ బ్లాగులో కామెంటు పెట్టి ఋణం తీర్చేసుకుంటాను :)

Saturday, 31 July 2010

ఫ్రెండ్షిప్ డే - ఒక జ్ఞాపకం

స్నేహం... ఒక అందమైన భావన
స్నేహం... మనిషికి .....

ఇంకా ఏదో రాద్దాం అనుకున్నాను. స్నేహం గురించి ఇప్పటికే చాలామంది చాలా అందమైన వర్ణనలు చేసేసారు, నువ్వు రాసే చెత్త అనవసరం అని అరిచాడు నా ఆత్మా రాముడు. నేను కూడా తగ్గకుండా "నేను సైతం..." అని ఏదో చెప్పబోతుంటే "ఏడ్చావులే, భువన ఘోషలో నీ వెర్రి గొంతుక కూడా కలిసిందని మురిసిపోకు. నీ గొంతు దేనికి కలిపినా అక్కడ శృతి పాడవ్వడం తప్ప ఏమి జరగదు " అని తేల్చేసాడు. ఐ హర్ట్ అని చెప్పి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. (వీడి కవిత చదివే గోల తప్పిందని మీరు కూడా రిలాక్స్ అవ్వచ్చు). కాని నేను అసలు చెప్పాలనుకున్న విషయం వేరు. ఈ విషయంలో మాత్రం ఒక సారి కమిట్ అయిపోయాక నేను ఆత్మారాముడి మాటలు వినను.


ఫ్రెండ్షిప్ డే అనే పదం వినగానే నాకు వెంటనే గుర్తు వచ్చేది 2006 ఆగస్ట్ 6 (ఆ సంవత్సరం ఫ్రెండ్షిప్ డే). నా జీవితంలో మర్చిపోలేనిది.బహుశా ఇంకో నలుగురి జీవితాల్లో కూడా అది వాళ్ళకి చాలా ఇష్టమైన రోజు.

Saturday, 17 July 2010

మాకూ వచ్చు తెలుగు

కృష్ణ అని నా స్నేహితుడు ఒకడు మా కంపెనీ లోనే పని చేస్తున్నాడు. నేను పూణే లో వాడు హైదరాబాద్ లో ఉండే వాళ్ళం  . రోజూ office communicator లో సొల్లు కబుర్లు చెప్పుకోవడం మాకు అలవాటు. "Hi dude! Weekend plans ఏంటి?" టైపులో మాట్లాడుకుని బోర్ కొట్టి ఒక రోజు నాకు కొత్త ఆలోచన వచ్చింది. మా వాడికి మాములుగానే చమత్కారాలు ఎక్కువ. నా ఆలోచన విని వాడు ఇంకా రెచ్చిపోయాడు. ఆ రెండు రోజుల మా సంభాషణలని ఇద్దరం సేవ్ చేసి పెట్టుకున్నాం . దాదాపుగా అది ఇలా ఉంటుంది.


(చదివే ముందు తెలియాల్సిన విషయాలు - మా వాడు అందరిని dude అనే పిలుస్తాడు. మేము కూడా వాడిని అలాగే పిలుస్తాం. అప్పట్లో మేము shifts లో పని చేసే వాళ్ళం. shift timings మధాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి పదింటి వరకు. )



నేను: రేయ్
కృష్ణ: చెప్పు
నేను: ఇవాళ నుంచి మనకి ఒక పోటి
కృష్ణ: ఏంటి?
నేను: ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలి
కృష్ణ: బాగుంది రా.
నాకు నచ్చినది. నేను మెచ్చితిని
నేను: ఈ క్షణమే ఆరంభం. చూపించుకో నీ తెలుగు జ్ఞానం
కృష్ణ: తప్పకుండా అందమైన తెలివైన యువకుడా
నేను: ??
కృష్ణ: అందమైన తెలివైన యువకుడు =dude

Sunday, 27 June 2010

నగర జీవనం

నీరెండ కిరణాలతో నిదురను తరిమేస్తూ
ఉత్సాహాన్ని నింపే ఉష

విధుల ఒత్తిళ్ళ అలుపును మరిపిస్తూ
సేద తీర్చే సంధ్య

అనుదినం వస్తుంది ఈ ద్వయం
అనుభవించేందుకు మనకు లేదు సమయం

హర్మ్యాలలో నివాసం
హాయి అంటే కేవలం కృత్రిమ విలాసం

ప్రకృతి అంటే అభిమానం
తన అందాలను ఆరాధించే ఆవకాశం
మిగల్చని పనిభారమే జీవనాధారం
ఇది ఈ నాటి నగర జీవన వైనం

Thursday, 3 June 2010

సిరివెన్నెల విరిజల్లులు -3 : ఆదిభిక్షువు వాడినేది కోరేది...


ఆదిభిక్షువు వాడినేది కోరేది....... ఈ పాట అందరికి తెలిసినదే. ఈ పాటను సీతారామ శాస్త్రి గారు రాసుకుంటే దానిని సిరివెన్నెల చిత్రానికి వాడడం జరిగింది. ఆయన రాసుకున్న పాటలోని అన్ని చరణాలు సినిమా పాటలో లేవు. క్రింద నేను ఆ పాటలోని అన్ని చరణాలను మీతో పంచుకుంటున్నాను.


ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది


తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరపు హంగు కూర్చిన వాడినేది అడిగేది

||ఆది భిక్షువు ||

Thursday, 29 April 2010

ఏక్ నిరంజన్ - ఏడ్చినట్టుండెన్




బంటి: హాయ్ రా. ఎలా ఉన్నావు? 
నేను: ఎలా ఉండడం మన చేతిలో ఏముంది రా. ఏదో ఉన్నాలే...

బంటి: ఏంటిరా అదోలా మాట్లాడుతున్నావు?
నేను: మన చేతలే మన చేతిలో లేవు. ఇంక మాటలదేముంది...
బంటి: ఏదో అయిపొయింది నీకు. అసలు ఏమైంది రా?
నేను: జ్ఞానోదయం అయింది. 
బంటి: రేయ్. ఒక్క మాటైనా అర్ధం అయ్యేలా మాట్లాడరా

నేను: ఇవాళే ఒక జీవిత సత్యం తెలుసుకున్నాను. 
బంటి: హమ్మయ్య. ఈ ముక్క కొంచెం అర్ధం అయింది. ఇంతకి ఏంటి అది?


Tuesday, 27 April 2010

సిరివెన్నెల విరిజల్లులు -2 :ఆకాశం తాకేలా...





చిత్రం:నువ్వొస్తానంటే నేనొద్దంటానా
సంగీతం:దేవి శ్రీ ప్రసాద్
గానం:బాలు




ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం
పదపదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం