నీరెండ కిరణాలతో నిదురను తరిమేస్తూ
ఉత్సాహాన్ని నింపే ఉష
విధుల ఒత్తిళ్ళ అలుపును మరిపిస్తూ
సేద తీర్చే సంధ్య
అనుదినం వస్తుంది ఈ ద్వయం
అనుభవించేందుకు మనకు లేదు సమయం
హర్మ్యాలలో నివాసం
హాయి అంటే కేవలం కృత్రిమ విలాసం
ప్రకృతి అంటే అభిమానం
తన అందాలను ఆరాధించే ఆవకాశం
మిగల్చని పనిభారమే జీవనాధారం
ఇది ఈ నాటి నగర జీవన వైనం
Sunday, 27 June 2010
Thursday, 3 June 2010
సిరివెన్నెల విరిజల్లులు -3 : ఆదిభిక్షువు వాడినేది కోరేది...
ఆదిభిక్షువు వాడినేది కోరేది....... ఈ పాట అందరికి తెలిసినదే. ఈ పాటను సీతారామ శాస్త్రి గారు రాసుకుంటే దానిని సిరివెన్నెల చిత్రానికి వాడడం జరిగింది. ఆయన రాసుకున్న పాటలోని అన్ని చరణాలు సినిమా పాటలో లేవు. క్రింద నేను ఆ పాటలోని అన్ని చరణాలను మీతో పంచుకుంటున్నాను.
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
||ఆది భిక్షువు ||