Sunday 27 June 2010

నగర జీవనం

నీరెండ కిరణాలతో నిదురను తరిమేస్తూ
ఉత్సాహాన్ని నింపే ఉష

విధుల ఒత్తిళ్ళ అలుపును మరిపిస్తూ
సేద తీర్చే సంధ్య

అనుదినం వస్తుంది ఈ ద్వయం
అనుభవించేందుకు మనకు లేదు సమయం

హర్మ్యాలలో నివాసం
హాయి అంటే కేవలం కృత్రిమ విలాసం

ప్రకృతి అంటే అభిమానం
తన అందాలను ఆరాధించే ఆవకాశం
మిగల్చని పనిభారమే జీవనాధారం
ఇది ఈ నాటి నగర జీవన వైనం

13 వ్యాఖ్యలు:

చందు said...

bagundi mitrama!

కౌండిన్య said...

బాగుంది

Sai Praveen said...

@ సావిరహే, కౌండిన్య,
నెనర్లు.

ప్రణీత స్వాతి said...

ప్రవీణ్ గారూ..ఇదన్యాయం..ఇంత బాగా రాసిన మీరు పామరులా(కంది శంకరయ్యగారి బ్లాగ్ లో చెప్పారు)..? నేనొప్పుకోనంటే ఒప్పుకోనంతే.

చాలా బాగుందండీ. నేటి జీవన విధానం చాలా చక్కగా చెప్పారు.

Sai Praveen said...

@ప్రణీత
:)
మీ అభిమానానికి ధన్యవాదాలు.

Sai Praveen said...

సుమిత్ర గారి వ్యాఖ్య
"బాగుందండి.
జీవితాన్ని ఆస్వాదించడానికి అపుడపుడు తీరిక చేసుకోవాలి కదా. ఏమంటారు? "

సుమిత్ర గారు,
మీ వ్యాఖ్య ప్రచురించడం ఎందుకో కుదరడం లేదండి. డాష్ బోర్డు లో కనపడటం లేదు. నా మెయిల్ నుంచి పబ్లిష్ చెయ్యడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ ఇస్తోంది. బ్లాగర్ లో ఏదో సమస్య అనుకుంటా.
ఇక మీ ప్రశ్న గురించి... కాదని ఎలాగంటాను. అదే కదా నా బాధ :)
దాదాపు రెండేళ్ళ క్రితం పూణే లో ఉంటున్నప్పుడు నా జీవితం మీద చిరాకులో రాసుకున్నది ఇది.
వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.

sphurita mylavarapu said...

చాలా బాగారాసారు ప్రవీణ్. మీ blog తరచూ చూస్తూనే వుంటా ఎలా miss అయ్యానో ఈ కవిత. ఎంత వెగటు పుట్టినా ఏమి చెయ్యలేక అందులోనే పడి కొట్టుకోవటం మన తరం దురదృష్టమేమో.

Sai Praveen said...

నిజమేనండి. మన తరవాతి తరం వాళ్ళు ఇవన్ని చిన్నప్పటినుంచే మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఒక రకంగా మీరు మీ పాపని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉంచడం మంచిదేనేమో అనిపిస్తోంది.

పరుచూరి వంశీ కృష్ణ . said...

చాలా బాగుందండి.....ఉదయించె సూర్యుడినీ,అస్తమించే సూరీడినీ చూడకుండా ఒక రోజు గడిస్తే ఎదో గా ఉంటుందండి

Sai Praveen said...

నిజమేనండీ. కాని ఇప్పుడు చాలా మంది జీవితాల్లో జరుగుతోంది ఇదే..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

vkc said...

ఒక్క సెకండ్ ఉష, సంధ్య మీ ఆఫీసులో అమ్మయిలేమోనని సందేహం వచ్చింది

విరిబోణి said...

చాలావరకు అందరి జీవితాలలో జరుగుతున్న దానిని సింపుల్ గా చాలా బాగా చెప్పారు . మనసుకు నచ్చని ఇలాంటి అవసరం అనే ఊభి నుండి ఎప్పుడు విముక్తులు అవుతామో మనం :(

Sai Praveen said...

నిజమేనండీ. భాదాకరమైన విషయం ఏమిటంటే చాలా మందికి బయట పడదామన్నా వీలు పడదు. :(