
రెండు నెలల క్రితం రెండవ సారి ఐస్ స్కేటింగ్ చేద్దామని వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంది. ఈ సారి మాత్రం ముచ్చటగా మూడో సారి వెళ్తున్నాం, ఛాంపియన్ లెవెల్ లో కాకపోయినా కనీసం ఐస్ మీద డాన్సు చేసేంత రేంజ్ లో అయినా నేర్చేసుకోవాలని జబ్బలు చరిచేసుకుని, (షేవ్ చేసేసిన) మీసాన్ని ముని వేళ్ళతో మెలేసి రింక్ లో అడుగు పెట్టాను. 'ఆహా ప్రవీణ్ నువ్వు సూపర్ గా చేస్తున్నావు' అని మా ఫ్రెండ్స్ అనగానే ఉబ్బి పోయి, తబ్బి పోయి, మాకు నేర్పించవా అని అడగగానే ఆలోచించకుండా ఒప్పేసుకుని దెబ్బయిపోయాను. సగం సమయం వాళ్ళని చెయ్యి పట్టుకుని రింక్ చుట్టూ తిప్పించడమే సరిపోయింది. మధ్య మధ్యలో దొరికిన కొంచెం గ్యాప్ లో నా మానాన నేను స్కేటింగ్ చేస్కుంటుంటే,....... సడెన్ గా ఎవడో వెనక నుంచి నాకు దగ్గరగా వస్తున్నట్టు అనిపించింది. విషయం అర్ధం అయ్యే లోపే డాష్ ఇచ్చేసాడు.
ధబ్!!! (శబ్దం)
నడుమిరిగిందిరో......!!!! (ఆర్త నాదం)
అయినా 'పట్టువదలని ప్రవీణ్ ని నేను' అని నన్ను నేను మోటివేట్ చేసుకుని, 'తెలుగు వీర లేవరా... స్కేట్సు కట్టి సాగరా' అని మనసులో ఒక సాంగేస్కుని మళ్ళీ లేచి మొదలు పెట్టాను. ఒక్క రౌండ్ వేసి వచ్చేసరికి..... పట్టుకున్న గోడని వదలలేక, ఉన్న చోట నుంచి కదలలేక, కనీసం సరిగ్గా నిలబడ లేక అవస్థలు పడుతున్న మా ఫ్రెండ్స్ మీద జాలేసింది. వాళ్ళు జాలిగా అర్ధిస్తూ నా వంక ఒక చూపు చూడగానే గుండె కరిగిపోయి, మళ్ళీ వాళ్ళ కోరిక మీద చెయ్యి పట్టుకుని స్కేటించడం మొదలు పెట్టాను. సాయంత్రానికల్లా స్కేట్ డాన్స్ చేసెయ్యాలన్న నా కల నెరవేరనివ్వట్లేదు అని వాళ్ళని తిట్టుకుంటూనే... కమిట్ అయ్యాక క్యా కరేఁ అనుకుంటూ కంటిన్యూ చేస్తున్నాను.
ఈ గొడవ ఇలా ఉంటే... దాహంతో ఒయాసిస్ కోసం వెతుకుతున్న వాడికి ఓల్డ్ మాంక్ రమ్ ఇచ్చి తాగమన్నట్టు, నాకు నేనుగా స్కేటింగ్ చేస్కోవడానికి దొరికిన కాస్త టైం లో లూయీ (మాతో పాటు వచ్చిన బ్రిటిష్ లేడి) వచ్చి "come on praveen... come with me..." అనేసి శర వేగంతో స్కేట్ చేసేస్తోంది. ఆవిడ స్పీడ్ ని అందుకునే ప్రయత్నంలో ఇంకో సారి ధబ్!!! కెవ్వ్‌వ్వ్‌వ్వ్...!!!!
ఇక ఇలా కాదని ఆనందం సినిమాలో MS నారాయణ లాగా "ooooh... horrible sweating!" అనుకుంటూ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. కాసేపు విశ్రమించిన తరవాత మళ్ళీ ఉపక్రమిస్తూ, ఈ సారి పరాక్రమంతో ప్రవీణ్ అంటే ఏంటో నిరూపించాలి అని గట్టి పట్టుదలతో, అంతా శుభమే జరగాలని కొండంత ఆశతో, కుడి కాలు పైకెత్తి, స్టైలుగా ఐస్ మీద అడుగు పెట్టీ పెట్టగానే..... కాలు జారి........ ధబ్!! ohh noooooooo.....!!!
అప్పుడు అర్ధమయింది. కొన్ని సందర్భాలలో ఆశ, పట్టుదలతో పాటు జాగ్రత్త కూడా అవసరమని. ఈ సారి గోడ గట్టిగా పట్టుకుని కేర్ ఫుల్ గా కాలెట్టి మళ్ళీ మొదలెట్టాం. నా ఫ్రెండ్స్ నన్ను చూసి, నువ్వు పడడం చూసాం ప్రవీణ్, పాపం గట్టిగా తగిలినట్టుందే... అని జాలి పడి నన్ను మళ్ళీ కాకా పట్టేశారు. వాళ్ళ ఎదురుగానే నేను కింద పడుతున్నా నా మీదే ఆధారపడుతున్న వాళ్ళ పరిస్థితికి జాలేసి , వాళ్ళు నన్ను అంత గొప్పగా చూస్తుంటే నా మీద నాకే ముచ్చటేసి, మళ్ళీ వాళ్ళ చెయ్యి పట్టుకుని నా టైం వేస్ట్ చేస్కున్నాక, కాసేపటి తరవాత మళ్ళీ నేను స్కేట్ చేస్కునే ఛాన్స్ వచ్చింది. అసలు నేను ఎంత స్పీడ్ గా వెళ్ళగలనో చూద్దామని ఒక చిలిపి కోరిక మొదలయింది. అలా నాకు కుదిరినంత స్పీడ్ తో దూసుకెళ్తూ ఉండగా.... సడన్ గా ఎవడో అడ్డొచ్చాడు. అరక్షణంలో అక్షర సత్యం గుర్తొచ్చింది. మనకి ముందుకి వెళ్ళడం వచ్చు కాని ఆగడం రాదు. మరుక్షణం అరిచాను. "ఒరేయ్....... తప్పుకోరా తెల్ల కుంకా. తప్ప్"..................
.............................. .................................. .................................. ............................... ...................... .................... ................................ఏదో జరిగింది....... ..................................... ................................... ............ ......ఏం జరిగింది?........................... .............................. ............................. ........................ ....ఏమో............................... ........................................... ......................................... ................................. .................. .................. .................. .............చుక్కలు కనిపిస్తున్నాయి ...................................... ...................... ........................ ................... ............................... చుక్కల మధ్యలో నుంచి......... .................... ....................... ................... ........................................ ......ఏదో గొంతు వినిపిస్తోంది..... ........................ ......................... ........ ఈ టైపు గొంతు ఎక్కడో విన్నానే....... ...................... ........................ ..................... ఎక్కడబ్బా??....................
నేడేచ్చూడండీ
మీ అభిమాన లండన్ ఐస్ స్కేటింగ్ రింక్ లో
" ప్రవీణ్ 'పడిన' పాట్లు "
విజయవంతమైన 4వ ధబ్!!!
ఏదో మిస్సింగ్ అనుకుంటున్నారు కదా? నిజమే....... ఈ సారి ఆర్తనాదం లేదు, చుక్కల మధ్య చీకట్లో కరిగిపోయిన నిశ్శబ్దపు నిట్టూర్పు తప్ప.
ఇంకేముంది?..... మోటివేషన్ మంచమెక్కింది. స్కేట్ డాన్స్ సంతకెళ్ళింది.
అంతరాయాలకి , అవాంతరాలకి చింతిస్తూ ఆ కార్యక్రమాన్ని అంతటితో సమాప్తం చేసేసి, ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రోజు రాత్రి అలసటతో ఆదమరచి నిద్రపోయిన నాకు, మరుసటి రోజు ఉదయాన్నే.....
Hey! What is this strange feeling?
నేను మొట్ట మొదటి సారి జిమ్ కి వెళ్ళిన రోజు గుర్తొస్తోందేంటబ్బా?
బుర్రలో ఒక సారి రీల్ రివైండ్ చేసుకుని ఆలోచిస్తే అర్ధమయింది. పడినప్పుడు తగిలిన దెబ్బలకి తోడు మా వాళ్ళని చెయ్యి పట్టుకుని తిప్పించినప్పుడు వాళ్ళ బరువంతా నా చెయ్యి మీదే వేసేయ్యడంతో భుజాలు, మెడ పట్టేసాయి. ఎవరైనా నా మెడని ముట్టుకుంటే మూలిగే పరిస్థితి. కాబట్టి ఎక్కడికీ కదలకుండానే ఆదివారమంతా గడిచిపోయింది :(
కొసమెరుపు:
తారకరత్న తార నటుడు (start actor) కావాలని తహ తహ లాడినట్టు
సుమన్ సినిమాలు తీయాలని సరదాపడుతున్నట్టు
నాకు ఈ మధ్య పద్యాలు రాయాలనే పైత్యం మొదలయింది.
అలా నా తీట కొలది రాసుకున్న ఆట వెలది.
ఆ.వె||
ఐసు స్కేటు సేతు నైసుగా నేనంచు
పరుగు లురక లిడుచు పయనమైతి
పడితి కాలు జారి పదిమంది నవ్వంగ
పరువు గంగఁ (థేమ్సుఁ) గలిసె పడతు లెదుట
:( :(
39 వ్యాఖ్యలు:
వహ్వా వహ్వా :-) పద్యం సూపరు, టపా డూపరు :) పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదన్నది గుర్తుపెట్టుకోండి ప్రవీణ్. పట్టువదలని విక్రమార్కునిలా స్కేట్ డ్యాన్స్ ప్రాక్టీస్ వదలకండి.
Thanq thanq :)
తప్పకుండా. మనం తగ్గేది లేదు. ఇండియా వెళ్ళే లోపు నేర్చేసుకోవాల్సిందే :)
anteeee india ki velladam doubt anna mata....
అలాంటి అనుమానాలేమి పెట్టుకోకురా. వెళ్ళిపోతున్నా తొందర్లోనే :)
వెళ్ళేటప్పుడు విజయ గర్వంతోనే వెళ్తాలే (నేను అనుకున్నది చేసేవరకు నిద్రపోను.నిజం. it's a lie) :)
haha...post baagundi dude...padyam kooda adurs!
aha..a.a..emi cheppav ra praveen...ne scating kastaalu kallamundu unchav...nice,,i hope u will succeed..
మీ "తీట" పద్యం బాగుందండీ.మీ స్కేటు పాట్లు కూడా.ఇంతకీ ఇండియా వెళ్ళేలోపు అనే ఈ డెడ్ లైన్ ఏమిటో:)?
పాపం ప్రవీణ్.. :P
టపా సూ....పర్.. చాలా బాగా రాసావు..:) ముఖ్యంగా ఆ ధబ్ ధబ్ లు..;) ఇక పద్యం అయితే కేక.. :)
అహూ.. రచ్చ చేస్తివి కదా సాయి.. సూపర్ అసలు..బ్రిటిష్ లేడి "కమాన్..కమాన్ " అంటే ముందూ యెనకా సూడకుండా దూకెయ్యటమే.?? :) :)
"ఈ సారి ఆర్తనాదం లేదు, చుక్కల మధ్య చీకట్లో కరిగిపోయిన నిశ్శబ్దపు నిట్టూర్పు తప్ప.
ఇంకేముంది?..... మోటివేషన్ మంచమెక్కింది. స్కేట్ డాన్స్ సంతకెళ్ళింది."..కెవ్వ్వు..కేకా .
పద్యం సూపరు, టపా డూపరు , బ్రిటిష్ లేడి బంపరు.. :) :)
@కృష్ణ
Thanks dude :)
@సీతారాం
థాంక్స్ రా. Lets hope... :)
@మానస గారు
ఇండియా వెళ్ళిపోతే ఇక ఐస్ స్కేటింగ్ కుదరదు కదండీ. ఎప్పుడైనా రోలర్ స్కేట్స్ ప్రయత్నించాలి. ధన్యవాదాలు. :)
@అపర్ణ
బోల్డన్ని థాంకులు :)
@వేణూరాం
>>బ్రిటిష్ లేడి "కమాన్..కమాన్ " అంటే ముందూ యెనకా సూడకుండా దూకెయ్యటమే.??
ఏం చెయ్యను బాసు. అప్పుడు అంత ఆలోచించలేక పోయాను. థాంకులు :)
హ్హ హ్హ... పోస్టు సూపరు విజయవంతమైన నాలుగో దెబ్బతో సహా.
హహ్హహ్హా.. భలే ఉన్నాయండీ మీ ఐస్ స్కేటు పాట్లు.. ఆటవెలది అద్దిరిపోయింది! నేను మాత్రం బొత్తిగా ఆశ, పట్టుదల లాంటివేమీ లేకుండా ఐస్ స్కేటు చేసే వాళ్ళని మాత్రం చూసి సంతోషించి ఊరుకుంటాను. :)
:-) ;-)
పడ్డ చోటే నిలబడి చూపించాలి నువ్వు తగ్గొద్దు సాయి..మేమంతా నీ వెనకే ఉన్నాం
కొంత మంది తోసెయ్ దానికి కాస్త జాగ్రత్త
ఆవు కధ లేకుండా మొత్తానికి కామెంట్ పెట్టేసా :)
పద్యం కేక :)
@3g
ధన్యవాదాలు. నేను ఇప్పుడే మీ పోస్ట్ చదివి కామెంట్ రాసి వస్తున్నా కాబట్టి ఈ సారికి ఒగ్గేస్తున్నా కానీ, తరువాత నుంచి మంచు గారిని ఫాలో అవ్వాలని డిసైడ్ అయిపోయా :)
@మధురవాణి
ధన్యవాదాలు. నా పాట్లు చదివిన తరవాత మీరు అలాగే ఉండాలని ఇంకా గట్టిగా నిర్ణయించేస్కుని ఉంటారుగా :P
@హరే కృష్ణ
నీ ప్రోత్సాహం చూస్తే నాకు రెట్టింపు ఉత్సాహం వచ్చేస్తోంది.
నువ్వు అలాగే కంటిన్యూ చేసెయ్యి. నేను రెచ్చిపోతా ;)
@అపర్ణా.........
ఇది నీకు పండుగ రోజు. ఈ సందర్భంగా నువ్వు మన వ.బ్లా.స సభ్యులందరికీ పార్టీ ఇవ్వాల్సిందే :) [హరే, నువ్వు కాకపొతే నేనున్నాను కదా ;) ]
ఒక మాంచి అమ్మాయిని గుద్దేసి చక్కగా డ్రీం సాంగ్స్ వేసుకునే వయస్సులొ పద్యాలు రాసుకుంటున్నవ్ ... నీ ప్లానింగ్ లొ ఎదొ లోపం ఉందనిపిస్తుంది సాయ్ .... ఇది బజ్ లొ డిస్కస్ చేసే ఐటం లా ఉంది... అక్కడ కలుద్దాం మరి
హెలో.. హెలో.. ఎవరూ మాట్లాడేది..? సిగ్నల్స్ సరిగ్గా లేవు...;) హిహ్హిహ్హీ..
అసలు నేనెందుకయ్యా ఇవ్వాలి పార్టీ...?? నాకు ఆన్సర్ కావాలంతే..:P
@మంచు
సాంగ్ వేస్కునేది డ్రీమ్ లో అయితే ఇక్కడ గుద్దడం మాత్రం అవసరమా? :)
ఆ ప్లానింగ్ లు వేరే ఉంటాయి లెండి. అన్నీ పబ్లిగ్గా చెప్పం కదా ;)
@అపర్ణ
అదేంటమ్మాయ్ అలా అంటావు? హరే కృష్ణ నిన్ను పార్టీ అడగని సందర్భంగా నువ్వు మాకు పార్టీ ఇవ్వాల్సిందే :))
ఓహో.. ప్రవీణ్ అలా వచ్చావా..:) నిజమే.. ఈ మధ్య కృష్ణ నన్ను పార్టీ అడగడం లేదు.. ష్.. మళ్లీ గుర్తు చెయ్యకు కృష్ణకి..:))ఇంకో పార్టీ అంటాడు. ఒక పార్టీ అంటే ఇచ్చుకుంటాం కానీ ఇలా రెండు మూడు అంటే కష్టం కదా..;)
అత్త తిట్టినందుకు కాదట తోటికోడలు నవ్వినండుకత అల్లా ఉంది ...డబ్ డబ్ మని నాల్గు సార్లు పడ్డందుకు కాదా మీ బాధ .. పరువు గంగఁ (థేమ్సుఁ) గలిసె పడతు లెదుట అందుకన్నమాట మీ ఈ పాట్లు. మీ స్కేటింగ్ తిప్పలు బలే నవ్వించాయి.
భాను గారు,
తెల్ల పిల్లల ముందు పరువు పొతే బాధాకరమే కదండీ :)
ధన్యవాదాలు.
My cheeks pained after reading your post.
@Kalyan
Thank you very much. :)
Good one.... ninnu akkadiki pilichi maree jeetham isthunnadi ila nee poetry kaaa ????????????? ;)
మీ లాగా మాకు ఫేస్ బుక్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తూ కూర్చుంటే జీతం ఇవ్వరు మేడం. పని చెయ్యక తప్పదు. సో ఇది వీకెండ్ లో రాసుకున్నాను. :)
నిజమే పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు ..... పట్టువదలని విక్రమార్కునిలా కాదు పట్టుదల లో బాల కృష్ణ లా try చేయండి ...మీ ఆట/తీట వెలది సూపరో సూపర్
@రంజని,
Thank you. :)
అన్నట్టు... పట్టుదలలో హీరో సుమన్ కదా :)
Sai Praveen గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@శివరంజని,
ధన్యవాదాలు. మీకు మీ కుటుంబ సభ్యులకు కుడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
హహ ప్రవీణ్ గారు చాల బాగా రాసారు .. నేను నవ్వినా నవ్వుకి నా పక్క చింకి అమ్మాయి .. నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసేద్దాం అనుకుంది :)
Hahahaa. Thanks a lot :)
బాగారాసారు. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదని నిరూపించారు
ధన్యవాదాలు స్నేహ గారు :)
man that was a good one..really
@Anonymous,
Thank you very much.
బావుందండీ..మీ పద్యం ఐతే నాలుగు ముక్కల్లో చెప్పేసింది మీ టపా సారాంశం మొత్తం...
మీరీ మధ్య ఎక్కడా కానరావడం లేదు...let me guess ఒకటి పని వత్తిడి...లేదా పెళ్ళి చేస్కుని వుంటారు...:D am I right?
:) :)
మొదటిదే కరెక్ట్ లెండి :) పెళ్ళికి ఇంకా సమయం ఉంది.
ఇన్నాళ్ళు దూరంగా ఉన్నా నన్ను నా బ్లాగుని గుర్తు పెట్టుకున్నందుకు చాలా థాంక్స్ :)
వహ్వా వహ్వా! మీ పద్యం చాలా బాగుంది! మీరిలా ఆపేస్తే ఎలా? మీరు చేయి పట్టుకుని నేర్పించే ఆ స్నేహితుల జాబితాలో నేను కూడా చేరి నేర్చుకుందామనుకుంటుంటే ;) మీరు ఆపకుండా కానిచ్చెయ్యండి దెబ్బలు తగలకుండా సైకిల్ త్రొక్కడం రాదుగా అలాగే ఇది కూడా అల్ ది బెస్ట్ అండీ!
హహ. థాంక్సండీ. నాకు కూడా సరదాగానే ఉంది కానీ ఇండియా వచ్చేసిన తరవాత ఐస్ స్కటింగ్ కుదరట్లేదు. రోలర్ స్కటింగ్ మొదలుపెట్టాలి :)
Post a Comment