Thursday 3 June 2010

సిరివెన్నెల విరిజల్లులు -3 : ఆదిభిక్షువు వాడినేది కోరేది...


ఆదిభిక్షువు వాడినేది కోరేది....... ఈ పాట అందరికి తెలిసినదే. ఈ పాటను సీతారామ శాస్త్రి గారు రాసుకుంటే దానిని సిరివెన్నెల చిత్రానికి వాడడం జరిగింది. ఆయన రాసుకున్న పాటలోని అన్ని చరణాలు సినిమా పాటలో లేవు. క్రింద నేను ఆ పాటలోని అన్ని చరణాలను మీతో పంచుకుంటున్నాను.


ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది


తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరపు హంగు కూర్చిన వాడినేది అడిగేది

||ఆది భిక్షువు ||


తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండ రాళ్ళను చిరయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది

ఏది కోరేది
వాడినేది అడిగేది


పగటి వెలుగును వేడితోటి రగిలించి పనికి ఫలితమ్ముగా చమట చిందించి
నిదురించు నిశిలోన శశి కాంతినించి చల్లదనమును కల్ల కలలుగా మిగిలించు
||ఆది భిక్షువు ||

ముల్లోకముల జ్ఞాన జ్యోతి వెలిగించగల మూడవ దృగింద్రియము మూసి ఉంచిన వాడు
తడబాటుతో తడుములాటతో వెతుకుటకు దారి చూపగలేని రెండు కళ్ళిచ్చాడు
||ఆది భిక్షువు ||


కారుణ్య చంద్రికల కురిపించు జాబిలికి కాలుష్యమొసగేటి ఆ కళాధరుడు
పురి విప్పి ఆడేటి నెమలి గాత్రమ్మునకు గావుకేకల పాట కూర్చేటి కవివరుడు
||ఆది భిక్షువు ||


మిన్నేటి ప్రళయమును ప్రణయమనుకున్నాడు బడిత పూజకు మురిసి పాశుపతమిచ్చాడు
తికమకలుగా జగతి గతి నడుపుతున్నాడు అసలు సంగతి మతికి అందనీకున్నాడు
||ఆది భిక్షువు ||


గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుడిని మసిజేసినాడు
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు
||ఆది భిక్షువు ||


ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
ముక్కంటి, ముక్కోపి, తిక్క శంకరుడు
||ఆది భిక్షువు||

20 వ్యాఖ్యలు:

శిశిర said...

మచి సాహిత్యం ఇచ్చారు. ధన్యవాదాలు.

అక్షర మోహనం said...

సిరివెన్నెల కురుయుసమయాన
కరిమబ్బుల తీరునడగలేని వానినేమి అడిగేది?/

సుమిత్ర said...

సాయి ప్రవీణ్ గారు,
మొదటిసారి మీ బ్లాగు చూశాను. చాలా బాగుంది.

ప్రణీత స్వాతి said...

ఇంకా ఇంత పాట ఉందా..? తెలియనే తెలియదండీ. చాలా బాగుంది పాట. నాకు చాలా ఇష్టమైన పాట.

ప్రణీత స్వాతి said...

ఇంతకు ముందు కూడా మీ బ్లాగ్ చూశానండీ. ఏక్ నిరంజన్ టపా చదివాను. బాగుందని కామెంట్ కూడా రాశాను. కానీ మీరు పబ్లిష్ చెయ్యలేదు. ఇప్పుడు కంది శంకరయ్య గారి బ్లాగ్ లో ఫ్రెండ్స్ అయిపోయాం కదా..మరి పబ్లిష్ చేస్తారా నా కామెంట్..?

Sai Praveen said...

ఎక్కడో పొరపాటు జరిగిందండి. ఆ టపా కి మీ కామెంట్ రాలేదు.మనం ఫ్రెండ్స్ అవ్వక ముందైతే మాత్రం, మీరు కామెంట్ రాయడము నేను పబ్లిష్ చేయ్యకపోవడమా :)
ఇంతకీ ఎం రాసారు?
నా టపాలు నచ్చినందుకు ధన్యవాదాలు.

ప్రణీత స్వాతి said...

ప్రవీణ్ గారూ థాంక్సండీ నా బ్లాగ్ కి విచ్చేసినందుకు, నా రాతలు(పిచ్చి గీతలు) మీకు నచ్చినందుకు.

ప్రణీత స్వాతి said...

అన్నట్టు శంకరయ్యగారి బ్లాగ్ లో సమస్యా పూరణం-15 చదివారా..? ఒకర్ని మించి ఒకరు అబ్బ..చెప్పనలవి కాదండీ. చాలా అద్భుతంగా రాశారు. వీలు చేసుకుని ఒకసారి చూడండి.

Sai Praveen said...

ఆఫీసు లో ఏదో ఒక టైం లో దాదాపు ప్రతి రోజు చూస్తున్నానండి. కామెంట్లు రాయడానికి కుదరట్లేదు అంతే.

కంది శంకరయ్య said...

సాయి ప్రవీణ్ గారూ,
నాకు ఎంతో ఇష్టమైన పాట పూర్తి పాఠం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగులో నా బ్లాగు ప్రస్తావించబడడం నాకు ఆనందంగా ఉంది.

రవి said...

చాలా బావుంది. ఇలాంటివి మరిన్ని రాయాలి మీరు.

Sai Praveen said...

@శంకరయ్య గారు,
ధన్యవాదాలు
@రవి గారు,
ఇందులో నేను రాసింది ఏముందండి. తెలిసిన సాహిత్యాన్ని నా బ్లాగు లో రాసుకుని సంతోషిస్తున్నాను అంతే. :)
నేను ఈనాడు పేపర్లో నిషిగంధ గారి బ్లాగు గురించి మీ బ్లాగు గురించి చదివిన తరవాతే తెలుగు బ్లాగులు చదవడం, కొన్నాళ్ళ తరవాత రాయడం మొదలు పెట్టాను. మీకు నా బ్లాగు నచ్చడం ఆనందంగా ఉంది.

నేస్తం said...

సాయి ప్రవీణ్ చాలా మంచి పాట అందించారు..ఇంకా ఇంత ఉందా :) ఆలశ్యం గా చూసా ఈ పోస్ట్ ..

Sai Praveen said...

@నేస్తం,
నెనర్లు :)

కౌండిన్య said...

మంచి సాహిత్యాన్ని అందించారు ధన్యవాదాలు

Sai Praveen said...

కౌండిన్య గారు,
వన్ ఫైన్ మార్నింగ్ అని ఒకసారి మెరుపులాగా మెరిసి మాయం అయిపొయారేంటండి ? మళ్ళి ఎప్పుడు మాతో కెవ్వుమనిపిస్తారు?

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ప్రవీణ్,
మీతో ఒక సంతోషం పంచుకోవాలని మీ బ్లాగ్ వెతుక్కుంటూ వచ్చాను.
సీతారామశాస్త్రిగారి గురించి ఎంతో చక్కగా ఓ అభిమాని రాసిన వ్యాసాల గురించి మీకు చెపుదామని... మీరూ ఎంతో ఇష్టంగా రాస్తారు కదా. ఇక్కడికెళ్ళి చూడండి మరి.
http://tanmayeevirinchi.blogspot.com/

Sai Praveen said...

మందాకిని గారు,
నా బ్లాగ్ గుర్తు పెట్టుకుని వచ్చి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
ఆ బ్లాగ్ తప్పకుండా చూస్తాను.
అపర్ణ అనే బ్లాగర్ కూడా ఇటువంటి ప్రయత్నమే చేస్తోంది. తన బ్లాగ్ చూడగలరు.
http://virajaajula-sirivennela.blogspot.com/
అలాగే ఈ క్రింది సైట్ గురించి మీకు తెలిసే ఉండవచ్చు.
http://www.sirivennela-bhavalahari.org/
సిరివెన్నెల గారి పాటల గురించి ఎంత మంది ఎన్ని రకాలుగా వర్ణించినా, ఎంతమందితో ఎన్ని సార్లు చర్చించినా తనివి తీరదు. ఏమంటారు? :)

విరిబోణి said...

నాకు చాలా ఇష్ట మైన పాటల్లో ఇది కూడా ఒకటి..మొత్తం lyrics మీకు ఎక్కడ దొరికాయి :)

Sai Praveen said...

ఆ సైట్ లింక్ నేను పోగొట్టుకున్నానండీ. సిరివెన్నెల గారి గొంతు లోనే విన్నాను నేను పూర్తి పాటను. మళ్లీ వెతికి తప్పకుండా ఇస్తాను.