Thursday, 29 April 2010

ఏక్ నిరంజన్ - ఏడ్చినట్టుండెన్
బంటి: హాయ్ రా. ఎలా ఉన్నావు? 
నేను: ఎలా ఉండడం మన చేతిలో ఏముంది రా. ఏదో ఉన్నాలే...

బంటి: ఏంటిరా అదోలా మాట్లాడుతున్నావు?
నేను: మన చేతలే మన చేతిలో లేవు. ఇంక మాటలదేముంది...
బంటి: ఏదో అయిపొయింది నీకు. అసలు ఏమైంది రా?
నేను: జ్ఞానోదయం అయింది. 
బంటి: రేయ్. ఒక్క మాటైనా అర్ధం అయ్యేలా మాట్లాడరా

నేను: ఇవాళే ఒక జీవిత సత్యం తెలుసుకున్నాను. 
బంటి: హమ్మయ్య. ఈ ముక్క కొంచెం అర్ధం అయింది. ఇంతకి ఏంటి అది?
నేను: ఈ మనసు ఉందే... భలే క్యామెడీస్ చేస్తుంది. కొన్ని సార్లు మన నడ్డి విరుగుతుంది అని తెలిసినా కాని గోతిలో దూకమంటుంది . అరటి తొక్క మీద అడుగెయ్యమంటుంది . 
బంటి: మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇంతకీ నీ మనసు ఏమంది? నువ్వు ఏం అఘాయిత్యం చేసుకున్నావు?

నేను: ఇందాకే ఏక్ నిరంజన్ సినిమా చూసాను. 

బంటి: ఓహ్! అదా సంగతి. అయినా ఆ సినిమా చుసిన వాళ్ళ మొహాల్లో నిరుత్సాహం చూసాను. చిరాకు చూసాను. డైరెక్టర్ మీద కోపం చూసాను. కాని ఈ వేదాంతం ఏంటి రా?
నేను: వాళ్ళందరూ తెలియక చూసి ఉండచ్చు. తెలిసి చూసిన వాళ్ళది రాతి గుండె అయి ఉండచ్చు. పైగా నేను చుసిన తరవాత కొంచెం ఆత్మ విమర్శ చేసుకుని ఒక సత్యం కనిపెట్టేసాను కదా. అందుకే ఇలా...
బంటి: అసలు సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యి ఆల్రెడీ పోయింది కదా. ప్రభాస్ కొత్త సినిమా కూడా వచ్చేసాక నీకు ఇది చూడాలని ఎందుకు బుద్ధి పుట్టింది?
నేను: చూడు నాయనా. వేదాంతం రెండో సారి వినే ఇంట్రస్ట్ నీకు ఉందేమో కాని మళ్ళీ చెప్పే ఓపిక నాకు లేదు. నీ మైండ్ రివైండ్ చేసుకుని నా మాటలు మళ్ళీ వినుకో.

బంటి: సినిమా అంత దారుణంగా ఉందా? 
నేను: అబ్బో అద్భుతం. కొత్తగా సరుకు ఏమీ లేని కథకి అనాథ సెంటిమెంట్ అద్ది , ఇష్టం వచ్చినట్టు తీసేసాడు. సహజత్వానికి అతి దగ్గరగా ఉండేలా హీరో రౌడీని పిడికిలి తో గుద్దగానే వాడు ధోనీ బ్యాట్ కి  తగిలిన బాల్ లా ఎగిరిపోవడం, హీరో గారు మాయల ఫకీరు లాగా తలుచుకున్న వెంటనే తోచిన దేశానికి వెళ్ళిపోవడం, అక్కడ వాడి ఇండియా మొబైల్ నెంబర్ పని చేసెయ్యడం,... అన్నిటికీ మించి ఆ హీరోయిన్ ఉంది అసలు... ఆమె అందచందాలు, రూపలావణ్యాలు చూసి...
బంటి: గుండెలో గుబులైందా?
నేను: కడుపు కకలావికలం అయింది.

బంటి: అదేంట్రా?బాలేదా? 
నేను: నువ్వు చాలా అదృష్టవంతుడివి రా. promos,posters కూడా చూడలేదనుకుంటా.
బంటి: నువ్వన్నదాంట్లో రెండో ముక్క కరెక్టే కాని, నేను నిజంగా అంత అద్రృష్టవంతుడినంటావా?
నేను: అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకు. నీ తలలో ఎన్ని సుడులున్నాయో నాకు తెలియదు కాని జాతకంలో మాత్రం చాలా ఉన్నాయి.

బంటి: కానీ పూరీ గాడు మంచి డైరెట్రే అనుకుంటా? 
నేను: ఏడిసాడులే. బద్రి చూసినప్పుడు కథ కొంచెం వెరైటీగా (వింతగా)ఉన్నా కాని సినిమా పర్లేదు అనుకున్నా. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చూసినప్పుడు వీడెవడో కొత్తగా ఆలోచిస్తున్నాడు. మంచి సినిమాలు ఇస్తాడు మనకి అనుకున్నా. కానీ ఆ తరవాత వాడికి నెమ్మదిగా తిక్క తలకెక్కడం స్టార్ట్ అయింది. దాంతో అక్కడ చోటు సరిపోక వాడి మెదడు మోకాలి మీద మోజుపడినట్టుంది.


బంటి: హి హి... ఈ సినిమా లో ఏమి పిచ్చి ప్రదర్శించాడేంటి? 
నేను: ఒకటా రెండా.. విలన్ హీరోయిన్ని చితక బాదడం, అర్ధం పర్ధం లేని సీన్లు తీసి సెంటిమెంటు పండించాననుకోవడం, కామెడీ ట్రాక్ లో బోలెడన్ని డబల్ మీనింగ్ డైలాగులు చెప్పించడం, పైగా అందుకో కొన్ని హీరోయిన్ని ఉద్దేశించినవి... ఇలా పలు పలు విధాలుగా తన పైత్య ప్రకోపాల్నీ పిచ్చి ప్రతాపాన్నీ రెచ్చిపోయి చూపిచ్చుకున్నాడు. 
పాపం ప్రభాస్ కష్టం వేస్ట్ అయింది. నిర్మాతకి సంతాపం తెలియజేయాలి. ఆగాగు... ఆ అందాల రాశి, అపరంజి బొమ్మ, మర్రిచెట్టు కొమ్మ( పోలిక చాలా తేలిక, జుట్టు<=>ఊడలు) లాంటి ఆ హీరోయిన్ ని అంత భారీ రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకోవాలనే ఐడియా నిర్మాతదే అయి ఉండచ్చు. ఇది నిజం అయితే తూచ్. నా సంతాపం కాన్సిల్.

బంటి: అయితే మొత్తానికి సినిమా అసలు చూడద్దంటావా? ఒక సారి ట్రై చెయ్యచ్చా? 
నేను: రేయ్...రామాయణం మొత్తం విని సూర్పణకకి శశిరేఖ ఏమవుతుందని .... ఛీ ఛీ... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నా కిడ్నీని నువ్వు  ... ఛీ ఛీ ఛీ... నా బ్రెయిన్ ని నువ్వు ... ఎహే పో... నీతో ఇంక నా వల్ల కాదు. 
వేదాంతం రెండో సారి వినాలనుకుంటే ఇంట్రస్ట్ ఎక్కువైంది అనుకున్నా. నీకు అర్ధం కాలేదన్నమాట. అదృష్టవంతుడివి అని పొగిడిన వెంటనే నీకు కలుగుతున్న కోరికలు చూసి ఇప్పుడు ఒక గంట ఫిలాసఫీ మాట్లాడాలి. అది చెప్పినా నీకు అర్ధం కాదు. కాని తొందర్లోనే అన్నీ తెలుసుకుంటావు. ఎందుకంటే కొన్ని అనుభవం మీదే అర్ధం అవుతాయి. అనుభవించు రాజా ...

P.S.: ఇందులోని utensils అన్నీ కల్పితాలు('నేను' కూడా). కాని పూరీలు , ఇడ్లీలు మాత్రం నిజాలు. 

29 వ్యాఖ్యలు:

sowmya said...

హ హ హ భలే రాసారండీ. మీలో మంచి కామెడీ ఉంది. ఈ సినిమా చూసకా నాకు కూడా కాస్త అయోమయంగానే అనిపించింది. ఏదొ కొంపలు మునిగిపోయినట్టు, జీవితంలో గొప్ప విషయన్ని కోల్పోతున్నట్టు ఫీల్ అయిపోయి డౌన్లోడ్ చేసుకుని మరీ చూసాను ఈ సినిమాని. కక్కలేక మింగలేక ఒక అసాధారణ స్థితి అనుభవించాను సినిమా చూసి. మీరు రాసిన విధానం చాలా బావుంది. keep rocking !

కౌండిన్య said...

:)

Anonymous said...

After watching this movie in theatres,i am not at all going for movies.
I decided not to see the movies in theaters,they are not that much worth.
The only movie that i have seen in theatre after EkNiranjan is LEADER,because i have some confidence on sekhar kammula.
Now i am planning to go to prastanam

swathi said...

Sai.. asalu ekkadiko velli poyav..

ek niranjan movie ninnu anta bhaada pettinda ;) ..

Anyways . good write up ..dialogs are super .. especially ramayanam dialog and the last note you wrote .. :) .. puri nee write up chaduvite maarutaadu emo ..

--Swathi.

Sai Praveen said...

@సౌమ్య
నేను కూడా సినిమా టాక్ తెలిసి కూడా చూసాను. అందుకే ఇంత రియాక్షన్ .
Thanks for the compliments.

@కౌండిన్య
నెనర్లు :)

@anonymous
తెలుగులో మంచి సినిమాలు కూడా వస్తున్నాయండి. మనం కొంచెం ఆచి తూచి అడుగెయ్యాలి అంతే :)
@స్వాతి
పూరి మారిపోవడమా??? తెలుగు ఇండస్ట్రీ కి అంత అదృష్టమా?? ఆశ పడడంలో తప్పు లేదులే :)
Thnq.

రాధిక said...

:)

Anonymous said...

superb annayya.....

kalyan said...

Era maa vade cinema meedha padava ente ra nuvvu. Movie sangathe pakana pedethe nee way of writing naaku chala baga nachendhe. Keep going...

Sai Praveen said...

@కళ్యాణ్
మీ వాడు కష్టపడ్డాడు అనే రాసాను కదరా. నా గోలంతా పూరి గురించి :)

madhuri said...

Super ammaaa Sai :).. ilaaane sadhyam ane manchi thriller chusi thrill ayyi.. ade kanti tho Maro Charithra ane adbutha cinema chusi.. ek niranjan ni pogudutu inkaa manchigaa rastaav ani asistunnanu

Madhuri

Sai Praveen said...

@మాధురి

కొంపతీసి నువ్వు అవన్నీ చుసేసావా ఏంటి?
బానే ఉన్నావా? Is everything OK?

madhuri said...

yooo.. bewarse ga endukani cinemala meeda research start chesanu eemadhyaa

krishna said...

dude assalu rechipoyav...neelo creativity pongi porlutondi..nuvvu ilanti blogs inka enno raayali ani aasisitunna.. :)

Sai Praveen said...

Thnq dude :)

nandan_yogi said...

yes friend exactly ur very much right ,for the sake of getting money these directors are thinking something out of the blocks (what i mean is against the values of our culture and society)and spoiling our society to a greater extent u know this has greater impact on the children and youngsters ,because they have tendency to follow others mannerisms,another thing is directors are following a commercial formula ,showing hero as a fool (pokiri,ekniranjan,idiot etc),adding a spicy song(u know youth is main target segment),including some tragedy,love etc.,he lags the entire story with a single point simple his movie hero is limelight,hit dialogues ,some twists and turns ,you know he takes the entire movie basing on a single point ,but lol you have really done an awesome job i liked a lot u have lot of depth in telugu and was put into right usage ,to create magical comedy ,keep writing like these ,u know nee rachanalatho kontha varaku pakka dova padutunna mana cineparishrama ni alochimpacheste i will be very very happy

Sai Praveen said...

@Nandan

Thank you very much buddy.
You are right. The heroine being characterless, she being used only for 'masala' sake, the hero continously teasing (eve teasing) the heroine have become quite common to an extent that we too are getting used to it (sad). But what really pissed me off is the comedians' dialogues abt heroine in this movie. On the other side, as u said, they are concentrating more on attracting the masses than making a captivating plot.

If this can really make them think, not only you and me, everyone will be happy to have nice movies :)

Vid said...

dude i dont know how to read. please translate :p

స్ఫురిత said...

మొన్న ఆదివారమే ఖాళీ ఎక్కువ అయిపోయి, ఏమి తోచక ఈ movie చూసి ఆ తర్వాత monday మొత్తం బుర్ర బద్దలు కొట్టుకున్నాను, నాకు ఇదేమి బుధ్ధి అని. మీ Review చదివాక వచ్చిన నవ్వుతో ఆ బాధ మొత్తం మర్చిపొయాను. ఇలాగే మేధ గారి Blog లో అనుకుంటా ఓయ్ Review చదివినప్పుడు ఆ Movie ని నా చేత వీక్షింపచెయ్యటం లో భగవంతుడి వుద్దేశం ఏమిటో తెల్సింది. పాపం ఇలాంటి కళాఖండాలు తీస్తేనే కదా బ్లాగర్ల Creativity పొంగి పొర్లేది అనుకుంటున్నారేమోనండీ ఈ వింత గా అలోచించే డైరెక్టర్లంతా...

అన్నట్టు నా Blog లో మీ Comments కి ధన్యవాదాలు

Sai Praveen said...

@స్ఫురిత
దీన్ని రివ్యూ అనడం ఎందుకులెండి :) ఇది సినిమా చూసాక నా రియాక్షన్ అంతే.
మీరు అన్నది కొంతవరకు నిజమేనేమో. ఇలా తమకి నచ్చని డైరెక్టర్లు, యాక్టర్ల మీద ప్రతాపం చూపించుకుంటారు కదా బ్లాగర్లు :)
మీకు కూడా నా ధన్యవాదాలు :)

Tallapudi Kiran said...

Bava Kumidobbav...... Telugu entha baga vaccha???? Adae upulo Varudu and Maro Charitra kuda chudu.... Kachithanga jeevetham meda virakthi vastundi.... Appudu Vedantham Prof avuthav.....

@Tallapudi Kiran

Sai Praveen said...

@కిరణ్
అంత ధైర్యం లేదు బావ :)
ఈ ఒక్కటి చాలు.

శివరంజని said...

హ హ హ భలే రాసారండీ.ఈ సినిమా నేను కూడా చూడవలసి వచ్చింది కర్మ.టోటల్ గా ఇదొక అర్ధం పర్ధం లేని సినిమా ...
అన్నట్టు నా Blog లో మీ Comment కి ధన్యవాదాలు

హారం ప్రచారకులు said...

Sai Praveen గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

శిశిర said...

:)మీ బాధ (రియాక్షన్) బాగుంది.

Sai Praveen said...

@శిశిర
ధన్యవాదాలు :)

kiran said...

@nenu adrustavanthuraline..nenu chudaledu..prabhas fan ayyi undi kuda.. :)..
juttu -uudalu -em polika ...em polika.. :) :P
bagundi.. :)

Sai Praveen said...

Thnq Kiran :)

విరిబోణి said...

బతికి పోయాను Dude :(( ఈ సినిమా nenu చూడలేదు :))

Sai Praveen said...

ur so lucky...lol :)