Sunday 31 October 2010

అమ్మ

"Thank God, I cud reach home in time and thanks again that the maid did not turn up! It felt so good to cook for her, when she is doing so much for you."

   నా కొలీగ్ ఫేస్ బుక్ లో తన భార్య గురించి రాసిన మాటలివి. చదవగానే నా మొహం మీద ఒక చిరు నవ్వు వచ్చింది. అంతటితో ఆగకుండా కొన్ని క్షణాలు చిన్న డ్రీం లోకి కూడా వెళ్ళిపోయాను. రేపు నా భార్యకి నేను ఇలా ఎపుడైనా చేసి పెడితే ఎలా ఫీల్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉండగా... ఒక చిన్న ఆలోచన తట్టి ఒక్కసారిగా కల నుంచి బయట పడ్డాను.

   చిన్నప్పటి నుంచి నాకు ఇన్ని చేసిన అమ్మ కోసం నేను ఏమైనా చేసానా? చాలా రోజుల తరవాత ఇంటికి వెళ్తే అమ్మ చేతి వంట తినాలని , అమ్మతో నచ్చినవన్నీ వండించుకోవాలి అని ఆలోచిస్తాను కానీ అమ్మకి నేను వండి పెట్టాలని ఎప్పుడైనా ఆలోచించానా? వంట అనే కాదు, పలానా పని చేస్తే అమ్మ సంతోషిస్తుంది అని ఎన్ని సార్లు అలోచించి ఉంటాను?

   నేనే కాదు, చాలా మంది ఇలా అలోచించి ఉండరు. ఇటువంటి ఆలోచనే మనకి ఎప్పుడూ రాకపోయినా మనకి ఏ లోటూ తెలియదు.

ఎందుకంటే....

అమ్మ ఏమీ ఆశించదు
అమ్మ ఎప్పుడూ అలగదు

22 వ్యాఖ్యలు:

..nagarjuna.. said...

very true bro...

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగ చెప్పారు, ఆశించడం సంగతి దేవుడెరుగు ఒక సారి ఏమైనా చేస్తాను అని అడిగి చూడండి. "పేద్ద చేయొచ్చావులే్వోయ్ కూర్చో రెండు నిముషాల్లో నేనే చేసిపెడతా" అంటుంది. బిడ్డను కష్టపెట్టకూడదనుకునే అమ్మ ప్రేమ అలాంటిది.

గీతిక said...

నిజమే ఎవరమూ ఇలా ఆలోచించమేమో...

గీతిక

3g said...

yes......

మనసు పలికే said...

సాయి, చాలా బాగా చెప్పావు. నువ్వు చెప్పింది 100% నిజం..అమ్మ ఎప్పుడూ అలగదు, మన నుండి ఏమీ ఆశించదు..
Very nice post Sai..:)

శిశిర said...

చాలా బాగా చెప్పారు. నిజమే. అమ్మ ఎప్పుడూ ఏమీ ఆశించదు. నేను అప్పుడపుడు మా అమ్మకి వండి పెడుతూంటాను. :) ఆ మాత్రానికే తెగ పొంగిపోతుంది.

karthik said...

perfectly said bro..
thats the greatness of motherhood.. no less than divinity..


-Karthik

రాజ్ కుమార్ said...

హ్మ్... నిజం చెప్పావు సాయి.

Sai Praveen said...

అందరికీ ధన్యవాదాలు.
అమ్మ విషయంలో అందరి మాట ఒక్కటే :)

Viveka said...

Thts true Praveen!!
Nenu chinnapudu ma mummy ki emanna help chesthe, she used to send me out of tht room.
Thought I wil help her in this age but even now, she wil nt allow me to do so.
Thn I felt tht MOTHER is grt, shows ultimate love and will not expect anything in return frm her kids, irrespective of their ages :)

హరే కృష్ణ said...

ఎవరక్కడ బాగా చెప్పావు అని కామెంట్లు పెడుతోంది
బ్లాగు రాసి ఒకమాట రాయకుండా ఇంకో మాట చెప్పడు మా సాయి..అంతేనా ;)

నేను కూడా అదే చెబుతున్నా బాగా చెప్పావు సాయి :)
ఇక్కడ ఎవరో అపర్ణ బాగా చెప్పావు అని చెప్పనందుకు రాయుడి గారి పంచాయితీ సాక్షి గా పార్టీ కి డబ్బులు ఇవ్వాల్సింది గా కోరడమైనది

Sai Praveen said...

@సిరి(వివేక)
ధన్యవాదాలు :)
@హరే
ధన్యవాదాలు.
నీ వ్యాఖ్యలన్నీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు విన్న కథ ఒకటి గుర్తొస్తోంది.
ఒక పిల్లాడిని ఆవు మీద వ్యాసం రాయమన్నారంటా.... ఆ తరవాతా.....

మనసు పలికే said...

మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..:)

Sai Praveen said...

@అపర్ణ,
నీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. హైదరాబాదులోనే ఉంటున్నావా భద్రాచలం వెళ్ళావా?

శివరంజని said...

చాలా చాలా చాలా చాలాబాగా చెప్పారు.ఏమి కామెంట్ లో తెలియడంలేదు

Sai Praveen said...

@శివరంజని
చాలా చాలా చాలా చాలా థాంక్స్ :)

విరిబోణి said...

నా కామెంట్ మీకు నచ్చే పాట రూపం లో : ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం , ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్న తీయని రాగం :))

Sai Praveen said...

నేను ఈ పాట ఇంత వరకు వినలేదండి. వినాలి.
మొత్తానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు కదా. చాలా చాలా థాంక్స్ :)

sphurita mylavarapu said...

short and sweet...and soo true

Sai Praveen said...

Thank you Sphurita gaaru :)

ప్రణీత స్వాతి said...

srusthilo teeyanidi amma preme kadandee..

రసజ్ఞ said...

నిజమే! బాగా చెప్పారండీ!