Saturday 3 April 2010

వాలెంటైన్స్ డే - కథ

"రేయ్ మావా"
"ఏంటి"
"టెన్షన్ గా ఉంది రా"
"మొన్నటి నుంచి చంపేస్తున్నావు రా.రాత్రే కదా టెన్షన్ అంటున్నావని దగ్గరుండి రెండు పెగ్గులు తాగించాను. మళ్లీ పొద్దున్నే లేచి టెన్షన్ అంటావేంటి రా"
"అది కాదు రా"
"మరి ఏది"
"టెన్షన్ గా ఉంది రా"

"రేయ్ మావా. మీరిద్దరూ ఎంత క్లోజ్ గా ఉంటారో నీకు తెలుసు. తనకు నీ మీద మంచి అభిప్రాయమే ఉంది. (నవ్వుతూ) పైగా నువ్వుఎంత వెధవవో నాకు తెలిసినంతగా తనకు తెలియదు"
"రేపు తనతో ఇలాగే మాట్లాడి మమ్మల్ని విడగొడతావా ఏంటి"
"(గుండె మీద చెయ్యి వేసుకుని) రేయ్ మహేష్. నేను నీ ఫ్రెండ్ ని రా. అలా ఎందుకు చేస్తాను"
"నాకు తెలుసు రా నువ్వు అలా చెయ్యవని" ధీమాగా అన్నాడు మహేష్.
"పిచ్చి మహేషు. బంగారు గుడ్డు పెట్టే బాతుని ఎవడు చంపుకుంటాడు రా. ఈ పాయింట్ తో నీ పెళ్లి అయ్యేవరకు
బ్లాక్ మెయిల్ చెయ్యచ్చు.రేపే ఎందుకు చెప్పేస్తాను." పెద్దగా నవ్వుతూ అన్నాడు శంకర్.

'వీడి PJ లు తగలెయ్య ' అనుకుంటూ నవ్వాడు మహేష్.
"వెరీ గుడ్. అదే స్మైల్ కంటిన్యూ చేస్తూ వెళ్ళు. ఇంతకి ఎక్కడ కలుస్తున్నారు.?"
"coffee day"
"సరే. లెటర్ తీసుకెళ్లడం మర్చిపోకు. చాలా కష్టపడ్డావు దాని కోసం."
"థాంక్స్ రా శంకర్"

మహేష్ , శంకర్ ఇద్దరు రూంమేట్స్. కాలేజీ నుంచే క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వేరు వేరు కంపెనీస్ లో పని చేస్తున్నారు. మహేష్ వాళ్ళఆఫీసు లోనే శాంతి కూడా పని చేస్తోంది. శాంతి , మహేష్ ఇద్దరు ఎంత తెలివైన వాళ్ళో అంత జోవియల్ నేచర్ ఉన్నవాళ్లు . కొలీగ్స్ గాఒకరికి ఒకరు పరిచయం అయ్యాక క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.

మహేష్ బైక్ మీద వెళ్తూ ఆలోచిస్తున్నాడు. అంత రద్దీ లోను అతని గుండె చప్పుడు అతనికి వినిపిస్తోంది. మామూలు కంటే వేగంగాకొట్టుకుంటోంది. కొంచెం ఆత్రుత గా కొంచెం కంగారు గా. అతను కొన్ని నెలల నుంచి కంటున్న కలలు నిజమవుతాయో లేదో తెలిసే రోజు ఇది.

శాంతి తో పరిచయంవాళ్ళ మధ్య జరిగిన సరదా సంఘటనలు ఒక్కొక్కటిగా మహేష్ కి గుర్తొస్తున్నాయి...


* * *


దాదాపు సంవత్సరం క్రితం..

మహేష్ వాళ్ళ టీం లోకి శాంతి కొత్త గా వచ్చింది. టీం లో అందరికి పరిచయం చేసారు. తను దగ్గరకు వచ్చి 'హాయ్చెప్పి షేక్ హ్యాండ్ఇచ్చినప్పుడే అనుకున్నాడు 'What a beautiful smile!' అని.
తను అతని పక్క cubicle లో కూర్చునేది. పదే పదే తనని చూడాలని అనిపిస్తోంటే హార్మోన్స్ పని చేస్తున్నాయి
అనుకున్నాడు కానీ హృదయం కూడా స్పందిస్తోంది అని అప్పుడు అతనికి అర్ధం కాలేదు.

ఆమె వచ్చిన రోజు నుంచి తన మోనిటర్ కంటే ఎక్కువ ఆమె వైపే చూస్తూ ఉండేవాడు. ఆమె కురులు ముందుకు పడి ముఖంకనిపించక పొతే వాటిని తను చేత్తో సర్దుకునే వరకు అలాగే ఎదురుచూస్తూ ఉండేవాడు. ఆమె వాటిని చెవుల వనుకకు సర్దుకోగానేగ్రహణం ముగిసిన తరువాత నిండు చంద్రుడిని చూసినంత సంబరపడిపోయేవాడు . ఆమె కళ్ళ కదలికలను గమనిస్తూఅప్పుడప్పుడుఆమె ఒక చిరునవ్వు నవ్వితే ఆ బుగ్గలో చిన్న మార్పుని చూసి మైమరచిపోయేవాడు.


ఒక రోజు మహేష్ లంచ్ కి కాంటీన్ కి వెళ్తే అక్కడ శాంతి కనిపించింది.
"భోజనం చెయ్యడానికి వచ్చారా?" అని అడిగాడు. వెంటనే 'ఛీ! stupid question అడిగానేమోఅనుకున్నాడు
శాంతి ఏమి మాట్లాడలేదు. కాని ఆ చూపులోనే మహేష్ చదవగలిగాడు 'మరి కాంటీన్ కి basket ball ఆడడానికి వస్తారా?'

"అంటే నా ఉద్దేశం ఇప్పుడే వచ్చారా భోజనం చేసి వెళ్ళిపోతున్నారా అని " కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు
"ఇప్పుడే వచ్చాను" నవ్వుతు అంది
"సరే అయితే కలిసి లంచ్ చేద్దాం" అన్నాడు
ఇద్దరు కలిసి కూర్చున్నారు.

"సో , మీ hobbies ఏంటి?" అని అడిగింది.
"ladies first. ముందు మీరు చెప్పండి"
"నాకు పాటలంటే పిచ్చి. మ్యూజిక్ బాగా వింటాను. And watching movies"
"నాకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. రెహ్మాన్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని"
"cool. ఇంకా?"
"ఇంకా ..... puzzle solving"
"Wow. Nice hobby. అయితే ఒక ఐడియా. నేను ఒక puzzle అడుగుతాను. మీరు నన్ను ఒకటి అడగండి. రేపు మళ్ళి లంచ్లో కలుద్దాం. ఎవరు answer చెప్పలేకపోతే వాళ్ళు ఒక చాక్లెట్ ఇవ్వాలి"
"Nice idea"

ఇలా మొదలైన వాళ్ళ స్నేహం తొందరలోనే ఒకరి మీద ఒకరు జోకులు వేసుకునేంతగా పెరిగింది. రోజు లంచ్ కి ఇద్దరు కలిసేవెళ్ళేవారు. puzzles చెప్పుకుంటూ చాక్లెట్లు పంచుకుంటూ సరదాగా గడిపేవారు.


ఒక రోజు ఆఫీసు లో మహేష్ ని శాంతి లంచ్ కి రమ్మని అడిగింది.
"నువ్వు వెళ్ళు. నేను తరవాత తింటానులే " అన్నాడు.

ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మహేష్ కొంచెం డల్ గా ఉండడం చూసి ఏమయింది అని అడిగింది.

"మన ప్రాజెక్ట్ కి కొత్త proposal వచ్చింది. ఇప్పటి వరకు మన టీం లో ఎవరు పని చెయ్యని కొత్త టెక్నాలజీ మీద చెయ్యాలి. దానికిఎస్టిమేషన్డిజైన్ వర్క్ అంత నన్ను చెయ్యమన్నాడు మన బాస్" అన్నాడు.
"Thats great. ఇది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ కదా. ఎందుకు అలా దిగులు గా ఉన్నావు " అంది.
"ఇది ఛాల్లెంజింగ్ వర్క్ . చెయ్యాలని నాకు కూడా ఉంది. కాని ఈ మంత్ ఎండ్ కి డెలివరీ ఉంది కదా. అది చేస్తూ ఇది కూడాచెయ్యాలంటే రెండిటి మీద concentrate చెయ్యలేనేమో అని కొంచెం టెన్షన్ గా ఉంది " అన్నాడు
"దానికేనా ఇంత బాధపడిపోతున్నావు. డెలివరీ కి నేను హెల్ప్ చేస్తాలే కాని నువ్వు ఆ పని చూడు" అని ధైర్యం చెప్పింది.

రెండు వారాల్లో పని పూర్తి చేసాడు మహేష్. మేనేజర్ తో పాటుగా టీం అందరికి ఈ కొత్త ప్రొపొసల్ గురించి సెమినార్ ఇవ్వబోతున్నాడు.

సెమినార్ రూం లో మహేష్ charts & slides ఎరేంజ్ చేస్తూ ఉండగా ఒకరిద్దరు వచ్చి కూర్చున్నారు.

రూం లోకి వస్తూ మేనేజర్ ఇంకా రాకపోవడం చూసి సరదాకి "may I come in? ఎవరండి రూం లో " అంది శాంతి.
"మనుషులు" అన్నాడు మహేష్.
మహేష్ ని ఎగాదిగా చూస్తూ వెటకారంగా అంది "అందరూ మనుషులేనా. Are you sure?"
"అరనిమిషం క్రితం వరకు అందరు మనుషులే ఉన్నారు. జస్ట్ ఇప్పుడే...."
"జస్ట్ ఇప్పుడే??"
"ఏదో వచ్చింది. " వచ్చే నవ్వును ఆపుకుంటూతల పక్కకు తిప్పి గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు మహేష్.
"అంత మాటంటావా ? నెక్స్ట్ వీక్ డెలివరీ కి నీ వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. దానికి నేనే హెల్ప్ చెయ్యాలి అని మర్చిపోకు" కోపం నటిస్తూ అంది శాంతి.

"అదే చెప్తున్నాను శాంతి. గదికే ఒక కళ వచ్చింది. ఒక వెలుగొచ్చింది. ఒక మెరుపొచ్చింది."
'నువ్వు దుర్మార్గుడివి రాఅని మనసులో అనుకుంటూ పైకి మాత్రం "అది. అలా రా దారికి" అంది.
'నా మనసు నీ వెనుకే నడుస్తొంటే నేను నీ దారికి రాక ఏమి చెయ్యగలను ' అని మనసులో అనుకుంటూ "నా సంగతి తరవాత.ముందు నువ్వు దారికి అడ్డు తప్పుకో. మన మేనేజర్ వస్తున్నాడు " అన్నాడు.


సెమినార్ పూర్తయింది. టీం లో అందరు మహేష్ ని congratulate చేసారు. వాళ్ళ మేనేజర్ కి ఇతని పని బాగా నచ్చింది.తొందర్లోనే అతనికి ప్రమోషన్ వచ్చింది.

వాళ్ళ టీం అందరికి పార్టీ ఇచాడు. సరిగ్గా ఆ సమయం లో శాంతి ఊరికి వెళ్ళడంతో తనని శంకర్ తో పాటు విడిగా పార్టీ కి పిలిచాడు.


రెస్టారెంట్ లో పార్టీ కి ముందు ముగ్గురు కలిసి సినిమా కి వెళ్లారు. అక్కడ శాంతి తో మహేష్ మాట్లాడే విధానంతను ఆమె వంక అదేపనిగా చూస్తూ ఉండడం చూసి శంకర్ కి అనుమానం వచ్చింది ' గురుడు పడ్డాడుఅని.

సినిమా అయ్యాక రెస్టారెంట్ కి వెళ్లారు. ఆర్డర్ చేసి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారు.

"సో , మీరిద్దరూ కాలేజ్ నుంచే ఫ్రెండ్స్ అన్నమాట" అంది శాంతి.
"అవును. అప్పటి నుంచే రూం మేట్స్ కూడా" అన్నాడు శంకర్.
"మహేష్ కి కాలేజ్ లో ఎవరైనా girl friends ఉన్నారా?" అడిగింది శాంతి
"వీడికా?వీడి ఫేస్ కి అంత సీన్ లేదు" అన్నాడు శంకర్.
"ఎం చెయ్యను. నేను ఏ అమ్మాయికి ట్రై చేసినా వీడు పోటి వచ్చేవాడు. టోటల్ గా ఇద్దరికీ వర్క్ అవుట్ అయ్యేది కాదు." అన్నాడు మహేష్.
"అప్పట్లో ఒకరిని ఒకరం చాలెంజ్ కూడా చేసుకున్నాం. ఎవరు ముందు స్టేటస్ committed అని మారుస్తారో అని. " నవ్వుతు అన్నాడు శంకర్.

వెంటనే శాంతి మహేష్ వైపు తిరిగి అంది "ఈ విషయం లో నేను నీకు హెల్ప్ చేస్తాను మహేష్. నా full
support నీకే. "
"కొలీగ్స్ ఇద్దరు కలిసి నన్ను ఇలా ఒంటరి వాడిని చేస్తే ఎలా" అన్నాడు శంకర్.
మహేష్ ఏదో యుద్ధం జయించిన తరువాత ఓడిపోయిన శత్రు రాజు తో మాట్లాడుతున్నట్టు మొహం పెట్టి అన్నాడు
"బాధపడకు రా శంకర్. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది."
"నిజమేరా . ఈ రోజు నీది "

ఆమె నవ్వింది.

ఇక్కడ fool అయింది తనే అన్న విషయం కూడా మర్చిపోయి తననే చూస్తూ ఉండిపోయాడు మహేష్. శంకర్ అనుమానం దాదాపు confirm అయిపొయింది.

తరువాత ఇద్దరు దాదాపు ప్రతి వీకెండ్ కలుసుకుంటూ ఉండేవారు. ఒక వారం గుడికి అయితే , ఒక వారం
రెస్టారెంట్ కి లేదా సినిమాకి.

ఒక రోజు మహేష్ సాయంత్రం ఇంటికి వచ్చాక ఏమి మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు. శంకర్ ఏదో పనిలో ఉండి మహేష్ ని పలకరించలేదు. కానీ మహేష్ ని గమనిస్తూనే ఉన్నాడు. రాత్రి పదింటికి సడెన్ గా ఏదో సాధించినట్టు మొహం పెట్టి పుస్తకం తీసిరాసుకుంటున్నాడు.


"ఏంటి రా ఈ రోజు చాలా తేడా గా ఉన్నావు. ఎం రాస్తున్నావు?" అడిగాడు శంకర్.
"రేయ్ శంకర్. నీకు ఒక విషయం చెప్పాలి రా."
"చెప్పు"
"నేను శాంతి ని ప్రేమిస్తున్నాను రా. "
శంకర్ చిరునవ్వుతో అన్నాడు "ఎప్పటినుంచో గమనిస్తున్నాను రా. నీకు నువ్వుగా ఎప్పుడు బయటపడతావో అని చూస్తున్నాను.మొత్తానికి చెప్పేసావు. మంచి ఛాయస్ రా. You make a nice couple."

"థాంక్స్ రా. వచ్చే ఆదివారం వాలెంటైన్స్ డే కదా. ఆ రోజు propose చేద్దాం అనుకుంటున్నాను. " అన్నాడు మహేష్.
"Thats cool. ఇంతకి ఏంటి రాస్తున్నావు."
"తనకి love letter ఇచ్చి propose చేద్దాం అనుకుంటున్నాను. ఆ లెటర్ కోసం ఒక కవిత రాస్తున్నాను "
"అయ్య బాబోయ్ !! ప్రేమ లో పడ్డాక బాగా ఎదిగిపోయావు రా నువ్వు " నవ్వుతు అన్నాడు శంకర్.
మహేష్ కొంచెం సిగ్గు నటిస్తూ "వింటావా ?" అన్నాడు.
"వద్దంటే మాత్రం ఊరుకుంటావానన్ను నిద్ర పోనివ్వవు కదా. సరే చెప్పు. " అన్నాడు శంకర్.


"తొలి చూపులోనే ఆకట్టుకున్నావు
మలి చూపులోనే మనసు దోచుకున్నావు "


"ఆకలేస్తే చాక్లెట్ ఇచ్చావు .
దాహమేస్తే sprite ఇప్పించావు.
నువ్వు నాకు నచ్చావ్ లో ప్రకాష్ రాజ్ ని చూసి inspire అయ్యావు కదా. " కన్ను కొడుతూ అన్నాడు శంకర్.

"రేయ్ ... ఎక్కువ చేసావంటే నిన్ను మర్డర్ చేసి నీ రక్తం తో లవ్ లెటర్ రాస్తా. నాకు శాంతి దగ్గర బిల్డప్ పెరుగుతుంది. నీ గోల కూడా వదులుతుంది." మొహం కోపంగా పెట్టి అన్నాడు మహేష్.
"సర్లేరా .. లైట్ తీస్కో. మిగతా కవిత చెప్పు. " నవ్వుతు అన్నాడు శంకర్.

"తొలి చూపు లోనే ఆకట్టుకున్నావు
మలి చూపు లోనే మనసు దోచుకున్నావు


నీ సాంగత్యం లోని సౌందర్యం
నీ స్నేహం లోని మాధుర్యం
కలకాలం పంచిస్తావా ప్రియనేస్తం
నా తోడై నిలుస్తావా ప్రతినిత్యం "


"వహ్ వా! వహ్ వా! ఇరగదీసావు మామా"
"థాంక్స్ రా"
"కవిత రాయడం మాత్రమే కాదు రా. Make your love letter as lovely as possible. దాన్ని అందంగా presentచెయ్యి. అది చూడగానే శాంతి పడిపోవాలి అంతే" నవ్వుతు అన్నాడు శంకర్

శంకర్ మాటలు మహేష్ కి బాగా నచ్చాయి. ఆ తరువాతి రోజు అతను ఒక customized గ్రీటింగ్ కార్డు తాయారు చేయించాడు.ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటో కి కింద ఈ కవితని ఒక అందమైన background తో ప్రింట్ చేయించాడు. కార్డు కి అక్కడక్కడ చిన్నచిన్న లవ్ షేప్ stickers అంటించాడు. మొత్తానికి చూడగానే ఎవరికైనా ముచ్చట వేసే కార్డు తాయారు చేసాడు.


వాలెంటైన్స్ డే ఆదివారం కావడంతో శాంతిని మామూలు గానే వీకెండ్ కలవడానికి పిలిచినట్టుగా పిలిచాడు. తను కూడా మహేష్ ఫోన్ కోసమే ఎదురుచుస్తున్నట్టుగా కలుద్దాం అనగానే వెంటనే వస్తాను అంది.


* * *



మహేష్ coffee day కి వచ్చి బైక్ ఆపాడు. తను అప్పటికే వచ్చి కుర్చుని వెయిట్ చేస్తోంది.
మహేష్ కి ఇంకా కొంచెం కంగారుగానే ఉంది. కానీ పైకి తెలియనివ్వకుండా పలకరించాడు.


"హాయ్ శాంతి"
"హాయ్ మహేష్"
"ఎంత సేపు అయింది వచ్చి. ఎక్కువ సేపు వెయిట్ చేయించానా?"
"అదేం లేదు. ఇప్పుడే వచ్చాను"

అడిగిన దానికి సమాధానం చెప్తోంది కానీ తను ఎప్పటిలాగా లేదు. కొంచెం టెన్షన్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకో అతని కళ్ళలోకిచూసి మాట్లాడట్లేదు.


మహేష్ కి ఏమి అర్ధం కాలేదు. అతనికి అనుమానాలు మొదలయ్యాయి. 'వాలెంటైన్స్ డే రోజు ఫోన్ చేసి కలుద్దాం అంటే నేను ప్రొపోస్ చేస్తున్నానని తనకి అర్ధం అయిపోయిందాఫోన్ చేసి రమ్మన్నప్పుడు కలవడానికి వెంటనే ఒప్పుకుంది కదా. సడెన్ గా తనకి ఈ అనుమానం వచ్చిందాతనకి నేను ఇష్టం లేనా?'

అన్ని ప్రశ్నలతో ఏమీ తేల్చుకోలేకపోతున్నాడు. ప్రేమించమని అడగడానికి వచ్చిన అతనికి ఏమి మాట్లాడాలో అర్ధం కావట్లేదు.

కాసేపు నిశ్శబ్దం.

తన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఆమెనే గమనిస్తున్నాడు.

తన ఎడమ చేతి వెలికి కుడి చేతి వెలి కోసలతో చున్నీని చుడుతోంది. టేబుల్ మీద కాఫీ వంక కాసేపు బయటకి కాసేపు చూస్తోంది.అతని వైపు చూపు తిప్పట్లేదు.

ఐదు నిమిషాల మౌనం తరువాతఈ నిశ్శబ్దాన్ని ఎలా ముగించాలి , తను అనుకున్నది చెప్పలేనిఆమె మనసులో ఏముందోతెలుసుకోలేని ఈ పరిస్థితి నుంచి ఎలా బయటకు రావాలి అని అతను ఆలోచిస్తూ ఉండగా ...
ఆమే ముందు మాట్లాడింది.

"మహేష్"
" "
"మనం ఇలాగ చాల సార్లు కలుసుకున్నాం కదా"
"అవును"
"కలిసిన ప్రతి సారి చాలా సరదాగా గడిపాం కదా"
"అవును"

మళ్లీ చిన్న నిశ్శబ్దం.

ఆమె ఏమి చెప్పాలనుకుంటోందో అతనికి అర్ధం కాలేదు. కానీ ఒక విషయం మాత్రం అర్ధం అయింది. తను చెప్పాలనుకుంది సూటి గాచెప్పలేకపోతోంది అని.


ఆమె కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరిచి తల పైకి ఎత్తకుండానే మళ్లీ మాట్లాడింది. ఈ సారి స్వరంలో కొంచెం మార్పు.కొంచెం గట్టిగా.... సూటిగా.


"నీతో ఉన్న ప్రతి క్షణం నేను చాలా సంతోషంగా ఉంటాను. నువ్వు పక్కన ఉంటే నాకు ఏదో ధైర్యంగా ఉంటుంది.
ఇలాగే ..."

అతను అప్రయత్నంగానే ఆమె చేతులు అందుకున్నాడు. ఆమె నోటి వెంట మాటలు ఆగిపోయాయి.

తల ఎత్తి అతని వంక చూసింది.

ఆ క్షణంలో వాళ్ళకి అర్ధమయింది. మాటల్లో చెప్పలేని భావాలు తెలపటానికి వారు రాసి తెచ్చుకున్న ప్రేమలేఖల సాయం అవసరంలేదు అని.

కొద్ది సేపు ........ వాళ్ళ కళ్ళే మాట్లాడుకున్నాయి.

 * * *

9 వ్యాఖ్యలు:

Anonymous said...

plz change ur blog background to white, and letters to black. that way it's more relieving to eyes and will attract more readers.

it's a pain to read this way.

శివ చెరువు said...

Very good... I read it complete.. u made it speachless in the climax..

Sai Praveen said...

శివ గారు నెనర్లు .

Mahesh said...

Picchekkinchaaru boss.....

Sai Praveen said...

Thnq very much :)

విరిబోణి said...

Hi Saipraveen garu,

పోస్ట్ చాలా బావుంది.. కద లో పాత్ర లన్ని నా కళ్ళ ముందు కు అలా వచ్చేసినట్టు వుంది. ఆ ఊహతోనే చివరిదాకా చదివా ! బాగా రాసారు :))

Sai Praveen said...

ధన్యవాదాలు విరిబోణి గారు :)

Anonymous said...

Chaaala Chaaala Bavundi boss...

Anonymous said...

chala chala ,bagunadi nakayete kala mundu jarugutunate unadi........